D Educt: Aug 31: IBPS RRB XIV నోటిఫికేషన్ సెప్టెంబర్ 1న.. 10 వేలకు పైగా పోస్టులు

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో (RRBs) నియామకాల కోసం భారీ రిక్రూట్‌మెంట్‌కు సిద్ధమైంది. CRP RRB XIV పేరుతో 10 వేలకు పైగా ఖాళీల భర్తీకి సెప్టెంబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నియామకాల ద్వారా బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులకు మంచి అవకాశం లభించనుంది.

ఈ ప్రక్రియలో ఆఫీస్ అసిస్టెంట్ (మల్టిపర్పస్), ఆఫీసర్ స్కేల్-I, స్కేల్-II, స్కేల్-III పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి విద్యార్హతలు, వయోపరిమితి, ఇతర అర్హతలు మారే అవకాశం ఉన్నందున అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా పరిశీలించాలి.

అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 1 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవడం మంచిది.

ఈ నియామకాల్లో భాగంగా ప్రిలిమినరీ పరీక్షలను నవంబర్ లేదా డిసెంబర్‌లో నిర్వహించనున్నట్లు సమాచారం. పరీక్ష తేదీలు, సిలబస్, ఫీజు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ తదితర పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో వెల్లడించనున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana