
DSports 26 Nov: గౌహతి వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్ అద్భుతమైన బౌలింగ్‌తో చెలరేగడంతో, టీమ్ ఇండియా చరిత్రలో అతిపెద్ద ఓటమిని చవిచూసింది. చివరి రోజు ఆటలో, దక్షిణాఫ్రికా ఆఫ్-స్పిన్నర్ సైమన్ హార్మర్ తన స్పిన్ మాయాజాలంతో 6 వికెట్లు పడగొట్టగా, భారత బ్యాటింగ్ లైనప్ కేవలం 140 పరుగులకే కుప్పకూలింది.
దీంతో, దక్షిణాఫ్రికా జట్టు భారత్‌ను 408 పరుగుల భారీ తేడాతో ఓడించింది. గత 25 సంవత్సరాలలో భారత గడ్డపై టెస్ట్ సిరీస్‌ను గెలిచిన మొట్టమొదటి దక్షిణాఫ్రికా జట్టుగా టెంబా బావుమా నేతృత్వంలోని జట్టు నిలిచింది. ఈ ఓటమితో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 0-2 తేడాతో కోల్పోగా, సొంతగడ్డపై భారత టెస్ట్ క్రికెట్‌కు ఇది ఒక ఘోర పరాజయంగా రికార్డ్ అయింది.
