
D Educt: Sept 7: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS)లో వివిధ బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి నిర్వహించిన టైర్-2 పరీక్షల ఫలితాలను నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) ప్రకటించింది.
దేశవ్యాప్తంగా మొత్తం 7,267 పోస్టుల భర్తీకి సంబంధించి మార్చి 22 నుంచి 25 వరకు టైర్-2 పరీక్షలను నిర్వహించారు. ప్రిన్సిపల్, టీజీటీ, పీజీటీ, ఫీమేల్ స్టాఫ్ నర్స్, అకౌంటెంట్, ల్యాబ్ అటెండెంట్ తదితర పోస్టులు ఈ నియామక ప్రక్రియలో ఉన్నాయి.
టైర్-2 పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రోల్ నంబర్ వివరాలను నమోదు చేసి ఫలితాలను, స్కోర్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం NESTS అధికారిక వెబ్‌సైట్ nests.tribal.gov.in లేదా CBSE అధికారిక వెబ్‌సైట్ cbse.gov.inను సందర్శించాలి.
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో సంబంధిత ఫలితాల లింక్‌ను ఎంపిక చేసి, అవసరమైన వివరాలను నమోదు చేస్తే తమ ఫలితాలు, స్కోర్ కార్డులను పొందవచ్చని అధికారులు తెలిపారు. తదుపరి నియామక ప్రక్రియకు సంబంధించిన వివరాలను కూడా అధికారిక వెబ్‌సైట్లలో పరిశీలించాలని సూచించారు.
