D Educt: Sept 30:ఏపీపీఎస్సీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత విద్యార్హతలు కలిగి ఉండాలి. హార్టికల్చర్, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, జియాలజీ లేదా అగ్రికల్చర్‌లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే బీఈ లేదా బీటెక్‌ అర్హత ఉన్న అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత కలిగిన అభ్యర్థులు 2026 అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 5న రాత్రి 11:59 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. అభ్యర్థులు గడువులోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.