DET:FEB 28:
రాజధానిలో సరికొత్త సినీ శకం – ఐఎఫ్ఎఫ్ డీ 2026:
భారత రాజధాని ఢిల్లీ నగరం సినీ ప్రియుల కోసం ఒక అద్భుతమైన వేడుకకు సిద్ధమవుతోంది.మార్చి 25 నుంచి 31 వరకు ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో మొట్టమొదటి అంతర్జాతీయ చలనచిత్ర వేడుకలు నిర్వహించనున్నారు.ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఇటీవల ఈ వేడుకకు సంబంధించిన లోగో మరియు కర్టన్ రైజర్‌ను ఆవిష్కరించారు.ఢిల్లీని ప్రపంచ స్థాయి సాంస్కృతిక మరియు సినీ కేంద్రంగా మార్చడమే ఈ ఉత్సవం యొక్క ప్రధాన లక్ష్యం.

100కు పైగా దేశాలు.. 125కు పైగా చిత్రాలు:

ఈ చలనచిత్ర వేడుకల్లో ఒక ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100కు పైగా దేశాల నుంచి చిత్రాలు ప్రదర్శితం కానున్నాయి.మొత్తం 2,000కు పైగా ఎంట్రీలు రాగా వాటిలో అత్యుత్తమమైన 125కు పైగా భారతీయ మరియు అంతర్జాతీయ చిత్రాలను నిర్వాహకులు ఎంపిక చేశారు.ఇందులో 40 శాతం హిందీ సినిమాలు 30 శాతం ప్రాంతీయ భారతీయ భాషల చిత్రాలు తెలుగు, తమిళం వంటివి మిగిలిన 30 శాతం విదేశీ చిత్రాలు ఉండనున్నాయి.దీనివల్ల ఢిల్లీ ప్రజలకు ప్రపంచ స్థాయి సినిమాను ఉచితంగా చూసే అవకాశం కలగనుంది.

భారత్ మండపంలో అట్టహాసంగా వేడుకలు:
ఈ ఏడు రోజుల వేడుకలు ఢిల్లీలోని ప్రతిష్టాత్మక భారత్ మండపం వేదికగా ప్రారంభం కానున్నాయి.కేవలం స్క్రీనింగ్ మాత్రమే కాకుండా సినీ పరిశ్రమలోని దిగ్గజాలతో మాస్టర్ క్లాస్‌లు,వర్క్ షాప్‌లు మరియు ప్యానెల్ డిస్కషన్లు కూడా నిర్వహించనున్నారు. అలాగే వర్ధమాన దర్శకులు మరియు టెక్నీషియన్ల కోసం సినీ ఎక్స్ఛేంజ్ పేరుతో ఒక ప్రత్యేక మార్కెట్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా కొత్త ప్రతిభావంతులకు అంతర్జాతీయ వేదిక లభిస్తుంది.

పర్యాటక రంగానికి ఊతం – ఫిల్మ్ టూరిజం:
ఈ ఫెస్టివల్ కేవలం వినోదం కోసమే కాకుండా ఢిల్లీలో ఫిల్మ్ టూరిజంను ప్రోత్సహించడానికి కూడా ఉపయోగపడుతుందని పర్యాటక శాఖ మంత్రి కపిల్ మిశ్రా తెలిపారు.సినిమా షూటింగ్‌ల కోసం సింగిల్ విండో పర్మిషన్లు ఇవ్వడం మరియు ఢిల్లీలోని చారిత్రక కట్టడాలను సినిమా వేదికలుగా చూపించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.ఈ వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో కూడా స్క్రీనింగ్‌లు ఏర్పాటు చేసి సినిమాను సామాన్య ప్రజలకు మరింత దగ్గర చేయనున్నారు.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana
పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana