
DSports Dec31 2025:భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో రికార్డుల రారాణిగా అవతరించారు. శ్రీలంకతో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో ఆమె ఒక వికెట్ పడగొట్టడం ద్వారా, టీ20 ఫార్మాట్‌లో ప్రపంచంలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచారు.
దీప్తి రికార్డు సాధించిన ఈ మ్యాచ్‌లో భారత్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 5-0తో క్లీన్ స్వీప్ చేసి, 2025 ఏడాదిని విజయవంతంగా ముగించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (68 పరుగులు) ఈ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడారు.ఇటీవల ముగిసిన మహిళల వన్డే వరల్డ్ కప్ 2025లో భారత్ విజేతగా నిలవడంలో దీప్తి శర్మ కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్నారు.
