
D Educt: Sept 3: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) పారామెడికల్ విభాగంలో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI) పోస్టుల భర్తీకి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈ ఫిజికల్ టెస్ట్‌లు సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షకు హాజరు కావాల్సిన అభ్యర్థులు CISF అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
PSTకు హాజరయ్యే పురుష అభ్యర్థులు కనీసం 170 సెం.మీ ఎత్తు ఉండాలి. మహిళా అభ్యర్థులకు కనీస ఎత్తు 157 సెం.మీగా నిర్ణయించారు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను తదుపరి దశల్లో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), డాక్యుమెంట్ల పరిశీలన, వైద్య పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు.
CISF ASI పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.29,200 నుంచి రూ.92,300 వరకు వేతనం లభిస్తుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డుతో పాటు ఒరిజినల్ విద్యార్హత, ఇతర సంబంధిత సర్టిఫికెట్లు, చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును తప్పనిసరిగా కేటాయించిన పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి.
అభ్యర్థులు అడ్మిట్ కార్డులో పేర్కొన్న పరీక్ష తేదీ, సమయం, కేంద్రం వివరాలను ముందుగానే పరిశీలించుకోవాలి. పరీక్షకు సంబంధించిన తాజా సమాచారం కోసం CISF అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా పరిశీలించడం మంచిది.
