
DSports Jan6 2026:ఢాకా: భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు చేతల్లోకి మారింది. ఐపీఎల్ నుంచి తమ ప్లేయర్‌ను తప్పించడాన్ని అవమానంగా భావిస్తున్న బంగ్లాదేశ్, ఇప్పుడు ప్రతిచర్యగా తన దేశానికి చెందిన అంపైర్లను భారత్‌కు పంపకూడదని నిర్ణయించుకుంది. ఫిబ్రవరిలో భారత్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచ కప్ 2026కు సంబంధించి ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
బంగ్లాదేశ్ తీసుకుంటున్న ఈ వరుస నిర్ణయాలపై బీసీసీఐ వర్గాలు స్పందిస్తూ.. “ఎవరి ఇష్టానుసారం వారు షెడ్యూల్ మార్చలేరు. ఇది ఐసీసీ ఈవెంట్. అంపైర్ల నియామకం కూడా ఐసీసీ పరిధిలోనిదే” అని స్పష్టం చేశాయి. అయినప్పటికీ, బంగ్లాదేశ్ మొండి పట్టుదలతో ఉండటం వల్ల టోర్నీ నిర్వహణలో కొంత గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది.
