D Educt: Aug 21: సింబయాసిస్ ఇంటర్నేషనల్ (డీమ్డ్ యూనివర్సిటీ)లోని పుణె, నోయిడా, హైదరాబాద్, నాగ్‌పూర్ క్యాంపస్‌లకు చెందిన లా స్కూళ్లలో అండర్ గ్రాడ్యుయేట్ లా ప్రోగ్రాముల్లో ప్రవేశానికి నిర్వహించే ‘సింబయాసిస్ లా అడ్మిషన్ టెస్ట్ (SLAT) 2027’ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

SLAT 2027 ప్రవేశ పరీక్షలను 2026 డిసెంబరు 19, 26 తేదీల్లో నిర్వహించనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ slat-test.orgలో తమ వివరాలను నమోదు చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్షకు రిజిస్ట్రేషన్ ఫీజుగా ఒక్కో టెస్ట్‌కు రూ.2,550 చెల్లించాలి. దీనికి ప్రభుత్వ పన్నులు అదనంగా వర్తిస్తాయి. అభ్యర్థులు ఎంచుకునే ప్రోగ్రామ్‌ను బట్టి ప్రతి ఇన్‌స్టిట్యూట్‌కు రూ.1,000 చొప్పున అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

అభ్యర్థులు దరఖాస్తును సమర్పించడంతో పాటు ఫీజు చెల్లింపు ప్రక్రియను 2026 డిసెంబరు 4వ తేదీలోగా పూర్తి చేయాలి.