
D Educt: Sept 9: ఆన్‌లైన్ వ్యవసాయ సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించనున్న ఆన్‌లైన్ వ్యవసాయ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ఎ. మణి తెలిపారు. ఈ మేరకు సెప్టెంబర్ 8న ప్రకటన విడుదల చేశారు.
విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో తేనెటీగల పెంపకం, చిరుధాన్యాల ఉత్పత్తి, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ వంటి అంశాల్లో సర్టిఫికెట్ కోర్సులను నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఒక్కో కోర్సుకు రూ.1,500 ఫీజు చెల్లించి సెప్టెంబర్ 30లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలి.
కోర్సులకు సంబంధించిన అర్హతలు, తరగతుల నిర్వహణ, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాల కోసం వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. అలాగే 70366 89346, 91822 45693 ఫోన్ నంబర్లలో సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని రిజిస్ట్రార్ సూచించారు.
