
DET:MAR 16:
మహిళా నటీమణుల విస్మరణ?
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఉన్న AAA సినిమాస్ ప్రాంగణంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజ నటుల ఫోటోలతో ఒక ప్రత్యేక గోడను రూపొందించారు.ఇందులో ఎన్టీఆర్,ఏఎన్నార్,కృష్ణ,శోభన్ బాబు నుండి నేటి తరం స్టార్స్ వరకు అందరి చిత్రాలు ఉన్నాయి.అయితే ఇందులో ఒక్క మహిళా నటీమణి ఫోటో కూడా లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నెటిజన్ల రియాక్షన్:
తెలుగు సినిమా ఎప్పటికీ మారదు..సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు.సావిత్రి ఎక్కడ?మహానటి సావిత్రి,జమున,భానుమతి వంటి దిగ్గజాలు లేకుండా తెలుగు సినిమా చరిత్ర ఎలా పూర్తవుతుంది? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.తెలుగు సినిమా ఎప్పుడూ మహిళల ప్రాముఖ్యతను గుర్తించదు అంటూ కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
అల్లు అర్జున్‌పై విమర్శలు:
ఒక స్టార్ హీరోగా అన్ని విభాగాలను గౌరవించాల్సిన బాధ్యత అల్లు అర్జున్‌పై ఉందని కనీసం సావిత్రి గారి ఫోటో అయినా ఉండాల్సిందని కామెంట్స్ చేస్తున్నారు.
థియేటర్ యాజమాన్యం వివరణ?
ఈ వివాదంపై అల్లు అర్జున్ లేదా AAA సినిమాస్ యాజమాన్యం ఇంకా అధికారికంగా స్పందించలేదు.అయితే ఇది కేవలం నటుల విభాగం అని త్వరలో నటీమణుల కోసం వేరే విభాగాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారని కొందరు అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు.
