
DET:MAR 10:
గతంలో ఏం జరిగింది?
గత నెలలో కరూర్‌లో విజయ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఒక బహిరంగ సభలో తీవ్రమైన తొక్కిసలాట చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.ఈ ఘటనలో కొందరు మరణించగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.ఈ కేసు విచారణను సీబీఐ చేపట్టింది.ఈ క్రమంలో విజయ్‌కు నోటీసులు జారీ చేసిన అధికారులు మార్చి 10న నేడు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.
15 రోజుల గడువు కోరిన విజయ్:
సీబీఐ నోటీసులపై స్పందించిన విజయ్ తన తరపు న్యాయవాదుల ద్వారా అధికారులకు లేఖ రాశారు.ప్రస్తుతం తాను దళపతి 69 షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉన్నానని అలాగే పార్టీకి సంబంధించిన కొన్ని అత్యవసర పనులు ఉన్నాయని పేర్కొన్నారు.ఈ కారణాల వల్ల తాను వెంటనే విచారణకు హాజరుకాలేనని మరో 15 రోజుల గడువు కావాలని సీబీఐని కోరారు.
రాజకీయ కోణం:
విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఇదే.తన ఎదుగుదలను అడ్డుకోవడానికే ప్రత్యర్థి పార్టీలు ఇటువంటి కేసులను తెరపైకి తెస్తున్నాయని విజయ్ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.మరోవైపు సీబీఐ ఈ గడువును అంగీకరిస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.అధికారులు కనుక గడువు ఇచ్చేందుకు నిరాకరిస్తే విజయ్ వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంటుంది.
