D Spiritual: Nov 20: ఈ నెల 24న తిరుపతిలో కార్తీక దీపోత్సవం.. గోవిందరాజస్వామి, కోదండరామాలయాల్లో ప్రత్యేక వేడుకలు!

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఈ నెల 24న కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం 6.30 గంటలకు శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి ఆలయం నుంచి కార్తీక దీపం, నూతన వస్త్రాలను ఆలయ ప్రాకారంలో ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ గోవిందరాజస్వామివారికి సమర్పించనున్నారు. అనంతరం ఆలయంతో పాటు ఉపాలయాల్లో కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

అదేవిధంగా తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలోనూ నవంబర్ 24న కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాత్రి 8 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి సన్నిధి నుంచి ఆలయ మర్యాదలతో పడి, కార్తీక దీపం, నూతన వస్త్రాలను ఊరేగింపుగా శ్రీ కోదండరామాలయానికి తీసుకురానున్నారు.

అనంతరం ఆలయంలో కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్తీక మాస పవిత్రతను చాటిచెప్పే ఈ వేడుకల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *