
నటీనటులు: మౌళి తనూజ్ ప్రశాంత్, శివాని నాగారం,
దర్శకుడు: సాయి మార్తాండ్
నిర్మాత: ఆదిత్య హాసన్
సంగీత దర్శకుడు: శింజిత్ యర్రమిల్లి
సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన లిటిల్ హార్ట్స్ అనే ఈ చిన్న సినిమా ఇప్పుడిప్పుడే పెద్ద చర్చనీయాంశంగా మారింది. మొదట్లో పెద్ద అంచనాలు లేని ఈ చిత్రం, కథన శైలి, సహజమైన ఎమోషన్లు, ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి.
తల్లిదండ్రులు కోరిన విధంగా చదువుకోవాలని ఒత్తిడి, కానీ మనసు మాత్రం వేరే దారిలో నడవాలని కోరుకోవడం – ఇలాంటి కన్ఫ్యూషన్లో ఉండే ఇద్దరు యువతీ యువకులు అఖిల్ (మౌళి తనూజ్ ప్రశాంత్), కాత్యాయని (శివాని నాగారం) ఒకే ఇన్స్టిట్యూట్లో కలుస్తారు. పరిచయం క్రమంగా స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారుతుంది. కానీ ఈ ప్రేమ ఎలాంటి పరీక్షలను ఎదుర్కొంటుంది? ఒకవైపు చదువులు, మరోవైపు ప్రేమ – ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు?
కాత్యాయనిపై అఖిల్‌కు పెరిగిన ప్రేమ తర్వాత అతను తెలిసిన ఒక షాకింగ్ సత్యం ఏమిటి? ఆ నిజం విన్న తర్వాత అతను తీసుకున్న నిర్ణయం ఏమిటి? తమ ప్రేమని తల్లిదండ్రులు అంగీకరిస్తారా? లేకపోతే వాళ్లు మరో దారి ఎంచుకుంటారా? చివరికి వీరి ప్రయాణం ఎక్కడికీ దారితీస్తుంది? అనే ప్రశ్నలకు సమాధానం థియేటర్లో దొరుకుతుంది.
దర్శకుడు సింపుల్ లవ్ స్టోరీని ఎమోషన్లతో మిళితం చేస్తూ తీసుకెళ్లిన తీరు బావుంది. కెమెరా వర్క్‌లో సహజత్వం కనిపిస్తుంది. మ్యూజిక్ అనేది ఈ చిత్రానికి హైలైట్. ప్రత్యేకంగా లవ్ ట్రాక్, ఎమోషనల్ సీన్స్‌కి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బలంగా అనిపిస్తుంది. ఎడిటింగ్ స్లోగా ఉన్నప్పటికీ ఎమోషనల్ కంటెంట్ దానిని కవర్ చేసింది.
మౌళి తనూజ్ ప్రశాంత్ సహజత్వంతో నిండిన నటన చేశాడు. సాధారణ బాయ్ నెక్ట్స్ డోర్గా కనిపిస్తూ ఎమోషన్లను బాగా మలిచాడు.
శివాని నాగారం తన పాత్రలో జీవించింది. ఒక స్ట్రాంగ్, కాన్ఫ్యూజ్డ్ యూత్ క్యారెక్టర్ని రియలిస్టిక్‌గా తీసుకువెళ్లింది.
సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా బలంగా నిలబడి కథకు లోతు ఇచ్చాయి.
ఈ సినిమాలో రాజీవ్ కనకాల యాక్టింగ్ ప్లస్ అయ్యింది.
సినిమాలోని కొన్ని భాగాలు మాత్రం స్లో పేస్‌గా అనిపిస్తాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో ఎమోషన్లను బాగా ఎలివేట్ చేయడానికి కొన్ని సన్నివేశాలు కొంచెం ఎక్కువ టైమ్ తీసుకోవడం వల్ల సినిమా ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది.
లవ్ స్టోరీ అన్ని మూవీస్ లో చూసినట్టే కొంచెం రొటీన్ గా అనిపిస్తుంది,డిఫరెంట్ కాన్సెప్ట్ ఎక్ష్పెక్త్ చేసి వచ్చినవాళ్లు కొంచెం నిరాశ పడతారు.
లిటిల్ హార్ట్స్ ఒక చిన్న సినిమా అయినప్పటికీ, హృదయాలను తాకే ఎమోషనల్ లవ్ స్టోరీగా నిలిచింది. సహజమైన కథనం, నిజజీవితానికి దగ్గరగా ఉన్న పాత్రలు, మ్యూజిక్, విజువల్స్ అన్ని కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా మార్చాయి. కొన్ని చోట్ల నెమ్మదిగా అనిపించినా, మొత్తం మీద ఇది ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉన్న మంచి చిత్రం.
