Gautham Ghattamaneni Gives 4.5 Rating to Ramayana Movie

DNews: బాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’ మరోసారి వార్తల్లో నిలిచింది. సూపర్‌స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రముఖ మూవీ రేటింగ్ ప్లాట్‌ఫామ్ లెటర్‌బాక్స్డ్‌లో ఏకంగా 4.5 రేటింగ్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

రణ్‌బీర్, యష్ నటనపై ప్రశంసలు

ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, యష్ రావణాసురుడిగా నటిస్తున్నారు. ముఖ్యంగా రావణుడి పాత్రలో యష్ నటన తనను ఎంతగానో ఆకట్టుకుందని గౌతమ్ ప్రశంసించినట్లు పేర్కొన్నారు. రణ్‌బీర్ నటన కూడా అద్భుతంగా ఉందని అభిప్రాయపడ్డారు.

టెక్నికల్ అంశాలకు ఫిదా

సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ (CGI), స్క్రిప్ట్, దర్శకత్వం, నటీనటుల ప్రదర్శన అద్భుతంగా ఉన్నాయని గౌతమ్ తన రివ్యూలో పేర్కొన్నారు. సినిమా చూసిన తర్వాత మాటలు రావడం లేదని, భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పే చిత్రమని కొనియాడినట్లు సమాచారం.

సినిమాపై పెరుగుతున్న అంచనాలు

గౌతమ్ ఇచ్చిన 4.5 రేటింగ్‌తో ఈ సినిమాపై సినీ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటికే రణ్‌బీర్ కపూర్, యష్ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ పౌరాణిక చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *