
D News: Nov 7: రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగింపు.. నవంబర్ 8 వరకు అవకాశం!
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) శుభవార్త అందించింది. గత నెల విడుదల చేసిన 3,548 నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (గ్రాడ్యుయేట్) పోస్టుల నోటిఫికేషన్ (CEN No.06/2026)కు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు గడువును నవంబర్ 8 వరకు పొడిగించింది. వాస్తవానికి నవంబర్ 6తో దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ముగియాల్సి ఉండగా, అభ్యర్థుల సౌకర్యార్థం మరో రెండు రోజులు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో మొత్తం 3,548 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వే జోన్ పరిధిలో 56 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నియామకాల్లో కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు గడువు ముగిసేలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకోవడం మంచిది.
