
D Educt: Nov 2: పీజీ మెడికల్ కోర్సుల ప్రవేశాల ప్రాధాన్య జాబితా విడుదల
ప్రస్తుత విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని పలు వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న పీజీ మెడికల్ డిగ్రీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నాన్ సర్వీస్, ఇన్ సర్వీస్, ప్రత్యేక అవసరాలున్న అభ్యర్థుల ప్రాధాన్య క్రమాన్ని విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అక్టోబర్ 31న విడుదల చేసింది.
మూడు కేటగిరీల్లో అభ్యర్థుల వివరాలు
నాన్ సర్వీస్ కేటగిరీలో 4,131 మంది, ఇన్ సర్వీస్ విభాగంలో 363 మంది, దివ్యాంగుల కేటగిరీలో 11 మంది అభ్యర్థులతో కూడిన ప్రాధాన్య జాబితాను ప్రకటించినట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ సాయిసుధీర్ తెలిపారు.
అభ్యంతరాలకు నవంబర్ 3 వరకు గడువు
జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో నవంబర్ 3వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటలోగా తెలియజేయాలని రిజిస్ట్రార్ అభ్యర్థులకు సూచించారు.
