
D News : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానుల సందడి మొదలైంది. సినీ ప్రముఖులు డార్లింగ్‌కు శుభాకాంక్షలు చెబుతుండగా.. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాత్రం తనదైన స్టైల్లో బర్త్‌డే సెలబ్రేషన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రభాస్‌తో ఆయన తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు తాజాగా వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటో మరింత ఉత్సాహాన్నిచ్చింది.
‘Spirits Are High’.. ఫొటోలో వంగా మార్క్ వైబ్!
ఈ ఫొటోలో సందీప్ రెడ్డి వంగా డ్రింక్ బాటిల్‌ను ఓపెన్ చేస్తూ కనిపించగా.. పక్కనే ఉన్న ప్రభాస్ సరదాగా నవ్వుతూ పోజులిచ్చారు. ‘Spirits Are High’ అనే క్యాప్షన్‌తో ఈ ఫొటోను పంచుకోవడంతో అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. ‘స్పిరిట్’ టైటిల్‌కు తగ్గట్టుగా ఉన్న ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఎలా ఉండబోతోందోనని ఫ్యాన్స్‌లో అంచనాలు మరింత పెరిగాయి.
2027 దీపావళికి ‘స్పిరిట్’ సందడి!
‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాలతో తనదైన ముద్ర వేసిన సందీప్ రెడ్డి వంగా.. ఇప్పుడు ప్రభాస్‌తో ‘స్పిరిట్’ను తెరకెక్కిస్తున్నారు. ఈ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక సినిమా విడుదల తేదీ విషయంలోనూ కీలక అప్డేట్ వచ్చింది. తొలుత 2027 మార్చి 5న విడుదల చేయాలని భావించిన ఈ చిత్రాన్ని, తాజా ప్రకటన ప్రకారం 2027 అక్టోబర్ 29న దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నారు. ప్రభాస్ బర్త్‌డే వేళ వైరల్‌గా మారిన ఈ ఫొటోతో పాటు విడుదల తేదీ అప్డేట్ కూడా అభిమానుల్లో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
