D Educt: Sept 28: ఐఐటీ మద్రాస్‌ నిర్వహిస్తున్న గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (GATE) 2027 ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును పొడిగించారు. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా 2026 అక్టోబర్‌ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

GATE 2027కు దరఖాస్తు చేసుకునే ఇండియన్‌ నేషనల్స్‌ అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ సమయంలో డిజిలాకర్‌ (DigiLocker)ను ఉపయోగించడం తప్పనిసరి చేశారు. డిగ్రీ పూర్తిచేసిన వారు లేదా ప్రస్తుతం మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులుగా పేర్కొన్నారు.

ఈసారి GATEలో కొత్తగా ‘రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమేషన్‌’ పేపర్‌ను ప్రవేశపెట్టారు. దీంతో మొత్తం పేపర్ల సంఖ్య 30గా ఉంది. అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో ఏవైనా మార్పులు చేయాల్సి ఉంటే అక్టోబర్‌ 14 నుంచి 21 వరకు సవరణలకు అవకాశం కల్పించారు.

GATE 2027 పరీక్షలను 2027 ఫిబ్రవరి 6, 7, 13, 14, 20, 21 తేదీల్లో నిర్వహించనున్నారు. పరీక్ష ఫలితాలను మార్చి 19న విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.