Iran Uses Prabhas’ Baahubali Video To Send A Strong Message Amid US Tensions

D News : అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ మరోసారి సోషల్ మీడియా ద్వారా తన వైఖరిని చాటింది. ఈసారి ఏకంగా ప్రభాస్ నటించిన ‘బాహుబలి: ది బిగినింగ్’ సన్నివేశాన్ని ఉపయోగించి ఆసక్తికరమైన సందేశాన్ని ఇచ్చింది. హైదరాబాద్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

బాహుబలి సీన్‌తో పోలిక

‘బాహుబలి: ది బిగినింగ్’లో అమరేంద్ర బాహుబలి కలకేయుల సైన్యాన్ని ఎదుర్కొంటూ తన సైన్యాన్ని నడిపించే సన్నివేశాన్ని ఇరాన్ ఎంబసీ షేర్ చేసింది. ఈ సన్నివేశాన్ని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ఇటీవల ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రసంగంతో పోల్చింది.

“తలవంచం.. మోకరిల్లం” అనే పెజెష్కియన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. బాహుబలి కలకేయుల ముందు నిలబడినట్లే, తమ మాతృభూమి కోసం తాము కూడా త్యాగానికి సిద్ధంగా ఉన్నామనే భావనను వీడియో ద్వారా వ్యక్తం చేసింది.

 Iran Uses Prabhas’ Baahubali Video To Send A Strong Message Amid US Tensions
UN ప్రసంగం తర్వాత పోస్టు

సెప్టెంబర్ 23న న్యూయార్క్‌లో జరిగిన 81వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో పెజెష్కియన్ అమెరికా ఒత్తిడి, ఆంక్షలు, బెదిరింపులపై మాట్లాడారు. ఒత్తిళ్లకు తాము లొంగబోమని చెబుతూనే.. బలప్రయోగం కాకుండా చర్చలు, దౌత్య మార్గాలకు ఇరాన్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

ఇదే నేపథ్యంలో బాహుబలి పోరాట సన్నివేశాన్ని తమ దేశ వైఖరికి ప్రతీకగా చూపిస్తూ ఇరాన్ ఎంబసీ ఈ వీడియోను పంచుకోవడం ఆసక్తికరంగా మారింది. గతంలోనూ ‘భగవంత్ కేసరి’లో బాలకృష్ణ యాక్షన్ సీన్‌ను ఇరాన్ రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో ఉపయోగించిన విషయం తెలిసిందే.

By Avinash