D Educt: Sept 23: ఏపీలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఏపీ ఫారెస్ట్ సబ్ ఆర్డినేట్ సర్వీస్‌లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంటర్ అర్హతతో దరఖాస్తు

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన విద్యార్హతతో పాటు నోటిఫికేషన్‌లో పేర్కొన్న శారీరక అర్హతలు కలిగి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,220 నుంచి రూ.80,910 వరకు వేతనం లభించనుంది.

పలు దశల్లో ఎంపిక ప్రక్రియ

అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBRT), వాకింగ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT) తదితర దశల ఆధారంగా నిర్వహించనున్నారు.

అక్టోబర్ 16 నుంచి దరఖాస్తులు

అర్హత కలిగిన అభ్యర్థులు 2026 అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని APPSC సూచించింది. దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించి, నిర్ణీత గడువులోగా అప్లికేషన్‌ పూర్తి చేయాలని పేర్కొంది.