
D News : బిగ్ బాస్ సీజన్ 10 తెలుగు మూడో వారం నామినేషన్స్ ప్రక్రియలో ఇంటి సభ్యుల మధ్య వివాదాలు మరింత ముదురుతున్నాయి. సెప్టెంబర్ 22 ఎపిసోడ్‌లో సృష్టి, సుధీర్ మధ్య జరిగిన గొడవ హౌస్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
సుధీర్‌ను నామినేట్ చేయాలని రామ్ ప్రసాద్.. నరేష్, దేబ్జానీలతో మాట్లాడాడు. సృష్టి ప్రవర్తనపై కూడా రామ్ ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మరోవైపు రోహిత్ సైతం సృష్టి వ్యవహారంపై త్రిగుణ్ ప్రభావం ఉందంటూ ముకేష్‌తో చర్చించాడు.
సృష్టి, సుధీర్ మధ్య మాటల యుద్ధం
నామినేషన్ అవకాశం రావడంతో సృష్టి ఎలాంటి ఆలోచన లేకుండా సుధీర్‌ను టార్గెట్ చేసింది. తన అవసరాల కోసం ఇతరులను ఉపయోగించుకోవద్దంటూ అతడిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తనతో సన్నిహితంగా ఉండి చివరికి తనను దూరం చేశాడంటూ సృష్టి ఆరోపించింది.
దీనికి సుధీర్ స్పందిస్తూ.. తాను ఎప్పుడూ సృష్టితో తప్పుగా మాట్లాడలేదని చెప్పాడు. తనను కొడతానని, పళ్లు రాలగొడతానని చెప్పడంతో పాటు ‘ఇడియట్’ అంటూ మాట్లాడటం తనను బాధించిందని పేర్కొన్నాడు. కేవలం 14 రోజుల ప్రయాణంలోనే ఇలాంటి మాటలు వినాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
‘ఫ్రీడమ్’ అనే మాటను తాను తన ఆటపై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో మాత్రమే చెప్పానని సుధీర్ వివరణ ఇచ్చాడు. చివరికి చేతులు జోడించి సృష్టికి నమస్కరించాడు.
ఈ సమయంలో త్రిగుణ్ కూడా మధ్యలోకి రావడంతో వివాదం మరింత ముదిరింది. నామినేషన్స్ సందర్భంగా సృష్టి, సుధీర్ మధ్య వాగ్వాదం కొనసాగుతుండగా.. చివర్లో సృష్టి సుధీర్‌పై చెత్తను విసిరింది. అయినప్పటికీ సుధీర్ సంయమనంతో వ్యవహరించినట్లు ఎపిసోడ్‌లో చూపించారు.
