
D News: Sept 15: APPSC Notification 2026 : ఉద్యోగార్థులకు భారీ నోటిఫికేషన్లు
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త అందింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసింది. మొత్తం 20 విభాగాలకు సంబంధించిన నోటిఫికేషన్లను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. వీటి ద్వారా మొత్తం 892 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలకు సంబంధించి వయోపరిమితిని సడలించిన నేపథ్యంలో ఈ నోటిఫికేషన్లు విడుదల కావడం నిరుద్యోగ యువతకు మరింత ఊరటనిచ్చింది. ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు తమ అర్హతలకు అనుగుణంగా నోటిఫికేషన్లను పరిశీలించి, నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని APPSC సూచించింది.
గ్రూప్-1 సహా కీలక పోస్టులు
తాజా రిక్రూట్మెంట్ డ్రైవ్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన గ్రూప్-1 కేటగిరీలో 163 ఖాళీలు ఉన్నాయి. వీటితో పాటు హార్టికల్చర్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్ (AE), హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ASO), ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO), ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) వంటి పలు కీలక పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు.
అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, పరీక్షా విధానం, సిలబస్, దరఖాస్తు ప్రక్రియ వంటి పూర్తి వివరాలను ముందుగా పరిశీలించుకోవాలి. ఇందుకోసం APPSC అధికారిక వెబ్సైట్ను సందర్శించి సంబంధిత నోటిఫికేషన్లను పూర్తిగా చదివిన అనంతరం దరఖాస్తు చేసుకోవాలని కమిషన్ సూచించింది.
