The Paradise Creates Overseas Buzz.. Over 5,000 Tickets Sold Before Release!

D News: నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా.. విడుదలకు ముందే ఓవర్సీస్ మార్కెట్‌లో తన సత్తా చూపిస్తోంది.

ముఖ్యంగా నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోలకు బుకింగ్స్ అదిరిపోతున్నాయి. ప్రీ-సేల్స్ ప్రారంభమైన కొద్దిసేపటికే $100K మార్క్ దాటిన ‘ది ప్యారడైజ్’.. తాజాగా $150K మార్క్‌కు చేరువైనట్లు సమాచారం. ఇప్పటివరకు 5,000కు పైగా టికెట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

విడుదలకు ఇంకా రెండు వారాల సమయం ఉండగానే ఈ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు కావడం ఆసక్తికరంగా మారింది. రాబోయే రోజుల్లో బుకింగ్స్ మరింత పెరిగితే నార్త్ అమెరికాలో నాని సినిమాకు భారీ ఓపెనింగ్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఓవర్సీస్‌లో సెప్టెంబర్ 23న ప్రీమియర్ షోలు జరగనున్నాయి. నార్త్ అమెరికాలో వేగంగా $100K ప్రీ-సేల్స్ అందుకున్న తెలుగు సినిమాల్లో ‘ది ప్యారడైజ్’ ఇప్పటికే ప్రత్యేక స్థానం సంపాదించిందని సమాచారం. ఇప్పుడు $150K మార్క్‌ను అందుకునే దిశగా దూసుకెళ్తుండటంతో యూఎస్ మార్కెట్‌లో సినిమా ఎలాంటి వసూళ్లు సాధిస్తుందనేది ఆసక్తిగా మారింది.

ఈ సినిమాలో కాయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటుడు మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన రావడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది.

మొత్తంగా రిలీజ్‌కు ముందే ఓవర్సీస్‌లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్న ‘ది ప్యారడైజ్’.. నాని కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్ సాధిస్తుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

By Avinash

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana