D News: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల మూడో రోజు కూడా రాజకీయ వేడి కొనసాగుతోంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ వేర్వేరు అంశాలను ముందుకు తీసుకురావడంతో నేటి సభలో మరోసారి వాడీవేడీ చర్చకు అవకాశం కనిపిస్తోంది.

నాలుగు అంశాలతో సభలోకి బీఆర్‌ఎస్

బీఆర్‌ఎస్ నేడు పలు కీలక అంశాలను సభలో లేవనెత్తేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎర్రవల్లి పరిణామాలు, కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు, తాతా మధు–నవీన్ రెడ్డి సస్పెన్షన్, రాష్ట్ర శాంతిభద్రతల అంశాలను ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు సమాచారం.

ఎర్రవల్లి ఘటనపై బీఆర్‌ఎస్ ఫోకస్

కేసీఆర్ ఎర్రవల్లి నివాసం వద్ద చోటుచేసుకున్న పరిణామాలపై బీఆర్‌ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ శ్రేణులు కేసీఆర్ నివాసం వైపు వెళ్లడం, తమ నేతలను పోలీసులు అడ్డుకోవడంపై పార్టీ సభలో ప్రశ్నలు లేవనెత్తనుంది.

హేట్ స్పీచ్‌పై కాంగ్రెస్ ఫోకస్

కాంగ్రెస్ పార్టీ హేట్ స్పీచ్ అంశాన్ని ప్రధానంగా తీసుకురానున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై సభలో మాట్లాడే అవకాశం ఉందని సమాచారం. తాతా మధు, నవీన్ రెడ్డిలపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కాంగ్రెస్ డిమాండ్ చేసే అవకాశం ఉంది.

22A అంశంపై బీజేపీ పట్టుదల

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రాజకీయ వివాదాలతో సభా సమయం వృథా అవుతోందని బీజేపీ విమర్శిస్తోంది. ప్రజా సమస్యలపై చర్చకు సభను ఉపయోగించాలని, రాజకీయ వివాదాలకు ముగింపు పలకాలని బీజేపీ కోరుతోంది.

మూడో రోజు సభపై ఉత్కంఠ

వరుసగా రెండు రోజుల పాటు తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యంలో మూడో రోజు సమావేశాలపై ఆసక్తి నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు–ప్రత్యారోపణలతో సభ మరోసారి హాట్‌హాట్‌గా సాగే అవకాశం ఉంది.