D News: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’పై అంచనాలు భారీగా ఉన్నాయి. పురాణాలు, టైమ్ ట్రావెల్, యాక్షన్, ఫాంటసీ అంశాలతో రూపొందుతున్న ఈ సినిమాలో అసలు ఎమోషనల్ కోర్ ఏంటో రాజమౌళి వెల్లడించినట్లు సమాచారం.

సినిమా కథకు తండ్రీకొడుకుల బంధమే ప్రధాన భావోద్వేగం అని తెలుస్తోంది. మహేష్ బాబు రుద్ర పాత్రలో నటిస్తుండగా, ప్రకాశ్ రాజ్ ఆయన తండ్రిగా కనిపించనున్నారు. కథ వివిధ కాలాలు, ప్రపంచాల మధ్య సాగినా ఈ బంధమే కథను ముందుకు నడిపిస్తుందని రాజమౌళి చెప్పినట్లు సమాచారం.‘వారణాసి’లో రామాయణానికి సంబంధించిన అంశాలు కూడా ఉండనున్నాయని టాక్. ఓ కీలక ఎపిసోడ్‌లో మహేష్ బాబు శ్రీరాముడిగా కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు.

ఆఫ్రికా అడవులు, అంటార్కిటికా, భారీ యాక్షన్, పురాణ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమా కేవలం సైన్స్ ఫిక్షన్ కాదని.. మైథాలజీ, ఫాంటసీ, ఎమోషన్ కలయికగా ఉంటుందని రాజమౌళి గతంలో పేర్కొన్నట్లు సమాచారం.

‘వారణాసి’ని 2027 ఏప్రిల్ 7న థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

By Avinash