D Spiritual: Sept 4: కృష్ణాష్టమి 2026: సెప్టెంబర్‌ 4న శ్రీకృష్ణ జన్మాష్టమి

గత కొంతకాలంగా హిందూ పండుగల తిథులు రెండు రోజుల పాటు వస్తుండటంతో భక్తుల్లో తేదీల విషయంలో తరచూ గందరగోళం నెలకొంటోంది. ఇలాంటి సందర్భాల్లో పంచాంగ కర్తలు, సిద్ధాంతులు సూచించిన తేదీని అనుసరించడం శ్రేయస్కరం. ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి (కృష్ణాష్టమి) విషయంలోనూ సెప్టెంబర్‌ 4న జరుపుకోవాలా? లేదా సెప్టెంబర్‌ 5న నిర్వహించాలా? అనే సందేహం భక్తుల్లో నెలకొంది.

శాస్త్రం, పంచాంగం ప్రకారం 2026 సెప్టెంబర్‌ 4, శుక్రవారం రోజునే కృష్ణాష్టమి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. సెప్టెంబర్‌ 4న ప్రారంభమయ్యే అష్టమి తిథి.. సెప్టెంబర్‌ 5 తెల్లవారుజాము వరకు కొనసాగనుంది.

అర్ధరాత్రి పూజా ముహూర్తం

పంచాంగం ప్రకారం సెప్టెంబర్‌ 4వ తేదీ రాత్రి 11:57 గంటలకు కృష్ణాష్టమి పూజా ముహూర్తం ప్రారంభమై.. సెప్టెంబర్‌ 5వ తేదీ తెల్లవారుజామున 12:43 గంటల వరకు కొనసాగుతుంది. అంటే భక్తులకు స్వామివారి అర్ధరాత్రి పూజలు నిర్వహించేందుకు సుమారు 45 నిమిషాల సమయం అందుబాటులో ఉంటుంది.

కృష్ణాష్టమి విశిష్టత

పురాణాల ప్రకారం శ్రావణ మాసంలోని అష్టమి తిథి, రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి సమయంలో శ్రీకృష్ణ భగవానుడు జన్మించాడు. లోకాన్ని అధర్మం నుంచి కాపాడేందుకు శ్రీమహావిష్ణువు ఎనిమిదో అవతారంగా శ్రీకృష్ణుడిగా అవతరించిన ఆ దివ్య సమయం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.

శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని భక్తులు కృష్ణాష్టమి రోజున ఉపవాసం పాటిస్తూ.. అర్ధరాత్రి సమయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం నైవేద్యాలు సమర్పించి, ఉట్టి కొట్టడం (ఉట్లోత్సవం) వంటి సంప్రదాయ వేడుకలను భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకుంటారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana