
D Educt: Sept 2: పోస్టాఫీసులో 23,757 జీడీఎస్ ఉద్యోగాలు
భారత తపాలా శాఖ దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 23,757 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా బ్రాంచ్ పోస్టుమాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్టర్ (ABPM), డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
పదో తరగతి అర్హత.. రూ.29,380 వరకు జీతం
ఈ ఉద్యోగాలకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష (తెలుగు) చదివి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం, సైకిల్ తొక్కడం వచ్చి ఉండటం తప్పనిసరి. వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీలకు వయోసడలింపు ఉంటుంది. పోస్టును బట్టి నెలకు రూ.10,000 నుంచి రూ.29,380 వరకు వేతనం లభిస్తుంది.
రాత పరీక్ష లేకుండానే ఎంపిక
జీడీఎస్ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు.. ఫీజు వివరాలు
ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వన్‌టైమ్ రిజిస్ట్రేషన్‌కు సెప్టెంబరు 19 చివరి తేదీ కాగా, దరఖాస్తుల సవరణకు సెప్టెంబరు 23, 24 తేదీల్లో అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్-ఉమెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉండగా.. మిగిలిన అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాలి.
ఒకే పోస్టల్ సర్కిల్‌కు దరఖాస్తు
అభ్యర్థులు ఏదైనా ఒక పోస్టల్ సర్కిల్‌కు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఒకటి కంటే ఎక్కువ పోస్టల్ సర్కిళ్లకు దరఖాస్తు చేస్తే వాటిని రద్దు చేస్తామని తపాలా శాఖ స్పష్టం చేసింది.
