
D Educt: Sept 2: పోస్టాఫీస్ స్కాలర్షిప్.. విద్యార్థులకు ఏడాదికి రూ.6,000
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న దీన్‌దయాళ్ స్పర్శ్ యోజన ద్వారా 6 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి రూ.6,000 స్కాలర్షిప్ అందుతుంది. విద్యార్థుల్లో స్టాంపుల సేకరణతో పాటు చరిత్ర, సామాజిక అంశాలపై అవగాహన పెంచడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం.
అర్హతలు ఇవే
గత ఏడాది పరీక్షల్లో కనీసం 60 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 5 శాతం మార్కుల సడలింపు ఉంటుంది. స్కూల్లో పోస్టల్ క్లబ్ సభ్యత్వం ఉండాలి. క్లబ్ లేకపోతే పోస్టల్ బ్యాంక్ ఖాతా ఉండటం అవసరం.
రెండు దశల్లో ఎంపిక
మొదటి దశలో 50 ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ, సైన్స్, స్పోర్ట్స్ తదితర అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. అర్హత సాధించిన విద్యార్థులు పోస్టల్ స్టాంపులకు సంబంధించిన ప్రాజెక్ట్ తయారు చేయాలి. ప్రతి పోస్టల్ సర్కిల్ నుంచి 40 మంది చొప్పున దేశవ్యాప్తంగా 920 మందిని ఎంపిక చేస్తారు.
ముఖ్య తేదీలు
ఎంపికైన విద్యార్థులకు ప్రతి మూడు నెలలకు రూ.1,500 చొప్పున, ఏడాదికి మొత్తం రూ.6,000 స్కాలర్షిప్ అందుతుంది. 2026లో దరఖాస్తు గడువు పోస్టల్ సర్కిల్‌ను బట్టి సెప్టెంబర్ 10 నుంచి 16 వరకు ఉంటుంది. పరీక్షలు సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు. దరఖాస్తు, పూర్తి వివరాల కోసం ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్‌ను చూడవచ్చు
