D Educt: Aug 31: పోస్టల్ శాఖలో 25 వేలకు పైగా GDS ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం

దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఖాళీల భర్తీకి Schedule-II, July-2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాల ద్వారా బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM), డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక

ఈ పోస్టులకు అభ్యర్థులను పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి ఎంపికైన వారికి నెలకు రూ.10,000 నుంచి రూ.12,000 వరకు ప్రారంభ వేతనం అందుతుంది. ఇతర అర్హతలు, వయోపరిమితి, ఉద్యోగ నిబంధనలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి.

సెప్టెంబర్ 21 వరకు దరఖాస్తులు

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 21, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది.

25 వేలకు పైగా ఖాళీలు?

2026 జులై సెషన్‌లో దేశవ్యాప్తంగా 25 వేలకు పైగా GDS ఖాళీలు ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇదే ఏడాది జనవరి సెషన్‌లో 28,740 GDS పోస్టులను పోస్టల్ శాఖ భర్తీ చేసింది. తాజా ఖాళీలకు సంబంధించిన కచ్చితమైన పోస్టుల సంఖ్య, సర్కిల్ వారీ వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో వెల్లడించనున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana