
D Educt: Aug 31: తిరుపతి నైలిట్ క్యాంపస్‌పై కీలక స్పష్టత
తిరుపతిలోని తమ క్యాంపస్‌ను మూసివేయడం లేదా ఇతర ప్రాంతానికి తరలించడం లేదని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నైలిట్) స్పష్టం చేసింది. తిరుపతి కేంద్రాన్ని భవిష్యత్తులో మరింత విస్తరించే ఆలోచన ఉందని వెల్లడించింది.
అమరావతిలో క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో తిరుపతి క్యాంపస్‌ను తరలిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని నైలిట్ ఆగస్టు 30న విడుదల చేసిన ప్రకటనలో ఖండించింది. తిరుపతి కేంద్రాన్ని కొనసాగిస్తామని, దాని కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో గరిష్ఠంగా మూడు నైలిట్ కేంద్రాలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో అమరావతిలో మరో క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించింది. అమరావతిలో కొత్త కేంద్రం ఏర్పాటుతో తిరుపతి క్యాంపస్‌పై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది.
