D Educt: Aug 24: తెలంగాణలో 7,437 పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) ఉద్యోగాలకు పోటీ పడుతున్న అభ్యర్థులకు టీ-సాట్ (T-SAT) నెట్‌వర్క్ శుభవార్త అందించింది. అభ్యర్థుల కోసం ఉచిత లైవ్ శిక్షణతో పాటు డిజిటల్ కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

రేపటి నుంచి ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సబ్జెక్టు నిపుణులతో ప్రత్యక్ష లైవ్ తరగతులు నిర్వహించనున్నారు. ఈ తరగతుల్లో అభ్యర్థులు తమ సందేహాలను నిపుణులను నేరుగా అడిగి నివృత్తి చేసుకునే అవకాశం కల్పించినట్లు టీ-సాట్ సీఈఓ బొదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.

ఈ ఉచిత శిక్షణలో భాగంగా పరీక్షలు పూర్తయ్యే వరకు దాదాపు 600 గంటల రికార్డెడ్ డిజిటల్ కంటెంట్‌ను ప్రసారం చేయనున్నారు. అభ్యర్థులు ఈ పాఠాలను టీ-సాట్ విద్య, టీ-సాట్ నిపుణ ఛానళ్ల ద్వారా వీక్షించవచ్చు.

టీ-సాట్ విద్య ఛానల్‌లో ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, టీ-సాట్ నిపుణ ఛానల్‌లో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు డిజిటల్ పాఠాలు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు తమకు అనుకూలమైన సమయంలో వీటిని ఉపయోగించుకుని పరీక్షలకు సిద్ధం కావచ్చు.

ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లే ఆర్థిక స్థోమత లేని గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు ఈ ఉచిత శిక్షణ కార్యక్రమం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు తెలిపారు. పోలీస్ ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధం కావాలని సూచించారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana