మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌పై ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ ఘనవిజయం సాధించడంతో, ఈ కొత్త చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి ‘కాకా’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజైన ఆగస్టు 22న ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. టీజర్‌లోనే మూవీ టైటిల్‌తో పాటు విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించే అవకాశముందని టాక్. దీంతో మెగా అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ Mega158 చిత్రానికి సంబంధించి తదుపరి షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇందులో భాగంగా ఓ ప్రత్యేక పాటను షూట్ చేయడంతో పాటు, యాక్షన్ కొరియోగ్రాఫర్లు రామ్-లక్ష్మణ్ పర్యవేక్షణలో చిరంజీవి, వందలాది మంది ఆర్టిస్టులతో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

కన్నడకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడకుండా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి-బాబీ కాంబో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందేమో చూడాలి.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana