
లడఖ్‌లోని లేహ్‌లో మరోసారి భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. గురువారం ఉదయం 9:54 గంటలకు 4.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ (NCS) వెల్లడించింది. భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఈ ప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని పేర్కొంది.
అంతకుముందు గురువారం ఉదయం 6 గంటల సమయంలోనూ లేహ్‌లో భూమి కంపించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.5గా నమోదైంది. దాదాపు నాలుగు గంటల వ్యవధిలోనే రెండు సార్లు భూప్రకంపనలు రావడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. లడఖ్ భూకంపాలకు తరచుగా గురయ్యే ప్రాంతంగా తెలిసిందే.
