
టీమ్ ఇండియా బంగ్లాదేశ్ పర్యటనపై ఆశలు పెట్టుకున్న ఆ దేశ క్రికెట్ బోర్డుకు ఎదురుదెబ్బ తగిలింది. భారత్-బంగ్లాదేశ్ సిరీస్‌పై స్పష్టత రాకముందే.. సెప్టెంబరులో అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు బీసీసీఐ షెడ్యూల్ ప్రకటించింది.
దిల్లీ వేదికగా భారత్-అఫ్గానిస్థాన్ మధ్య మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. అఫ్గాన్ జట్టుకు దిల్లీ హోమ్ గ్రౌండ్‌గా వ్యవహరించనుంది. ఇటీవలే ఇరు జట్ల మధ్య టెస్టు, వన్డే సిరీస్ జరిగిన విషయం తెలిసిందే.
మ్యాచ్‌ల షెడ్యూల్
- తొలి టీ20: సెప్టెంబర్ 13
- రెండో టీ20: సెప్టెంబర్ 15
- మూడో టీ20: సెప్టెంబర్ 19
అఫ్గాన్ క్రికెట్‌కు మద్దతు: మిథున్ మన్హాస్
అఫ్గానిస్థాన్ క్రికెట్ అభివృద్ధికి బీసీసీఐ ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ తెలిపారు. అత్యున్నత స్థాయిలో పోటీపడేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు ద్వైపాక్షిక సిరీస్‌ల ద్వారా నాణ్యమైన క్రికెట్ అనుభవాన్ని అందించేందుకు సహకరిస్తామని చెప్పారు.
భారత్‌తో టీ20 సిరీస్ కోసం అఫ్గానిస్థాన్‌ను ఆహ్వానిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
మూడు ఫార్మాట్లలోనూ పోరుకు సిద్ధం
భారత్ వేదికగా అఫ్గానిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ సిరీస్‌కు బీసీసీఐ పూర్తి మద్దతు ఇస్తోందని కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారని, అందుకే పోరు ఆసక్తికరంగా ఉంటుందని చెప్పారు.
భారత్‌లో అఫ్గాన్ క్రికెటర్లకు కూడా మంచి అభిమానులు ఉన్నారని పేర్కొన్న సైకియా.. భవిష్యత్తులో మూడు ఫార్మాట్లలోనూ ఇరు జట్లు తలపడేందుకు ఉన్న అవకాశాలను వినియోగించుకుంటామని స్పష్టం చేశారు.
ఇక సెప్టెంబర్‌లో జరగనున్న ఈ మూడు టీ20ల సిరీస్‌పై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
