
DNews: Apr08: పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు సడలడంతో బుధవారం భారత స్టాక్ మార్కెట్లు కొత్త రికార్డులకు చేరాయి. ఇరాన్, అమెరికా మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందన్న వార్తతో పెట్టుబడిదారులు ఉత్సాహపడ్డారు. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి. ఈరోజు మార్కెట్లో ఒకానొక దశలో, సెన్సెక్స్ 2,900 పాయింట్లకు పైగా పెరిగి 77,600 మార్కును తాకింది. నిఫ్టీ దాదాపు 890 పాయింట్ల భారీ పెరుగుదలతో 24,000 మైలురాయిని దాటింది. కేవలం ఒక్క రోజులోనే పెట్టుబడిదారుల సంపద దాదాపు రూ. 16 లక్షల కోట్లు పెరగడం గమనార్హం.
