
స్టార్ మా లో గత 8 సంవత్సరాలుగా సక్సెస్ దారిలో నడిపిస్తూ,ప్రేక్షకుల ప్రశంసలు అలాగే విమర్శలతో వినోదం అందజేస్తున్న షో అని చెప్పుకోవచ్చు,ప్రతి సంవత్సరం ఆగష్టు ,సెప్టెంబర్ ఈ షో మొదలవుతుంది,కానీ ఈ సారి కొత్త కాన్సెప్ట్ తో ముందుగా అగ్నిపరీక్ష అనే పేరుతో ఓన్లీ కామన్ పీపుల్ ని టార్గెట్ చేస్తూ కొంతమందికి పరీక్షలు పెట్టి అందులో జడ్జెస్ ని సంతృప్తి చేసిన వారిని బిగ్ బాస్ 9 షో లోకి పంపించడం ఈ కాన్సెప్ట్ ముఖ్య ఉద్దేశం.అందులో భాగంగా అగ్నిపరీక్ష షో జడ్జెస్ గా నవదీప్,బిందు మాధవి,అభిజీత్ ని పెట్టారు.
అగ్రిమెంట్ ప్రకారం జరుగుతున్నా ఈ షో లో నవదీప్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా నిలిచాయి.ఆ షో లో సోమవారం ప్రసారమైన ఎపిసోడ్లో నవదీప్ ఓ పోటీదారిని ఊరనుండి వస్తారు” అని పేర్కొన్నారు, ఇది గ్రామీణ ప్రాంతాల వారిని అవమానించేలా అనిపించింది.నిత్యం డేర్ గా తనకి నచ్చినట్టు మాట్లాడుతూ ఎవరికీ భయపడకుండా రాణిస్తున్న ఒక కామన్ అమ్మాయిని శ్రీముఖి,నవదీప్ నీకు అంత సీన్ లేదంటు,పల్లెటూరి నుంచి వచ్చావ్ అని తన అభిప్రాయాలకి విలువని ఇవ్వకుండా కించపరిచేలా మాట్లాడడం వలన ప్రేక్షకులు నవదీప్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పల్లెటూరి నుంచి వచ్చావ్ అని ఊరిని తక్కువ చేసి మాట్లాడడం ప్రజలకు నచ్చడంలేదు.ఇలాంటి షోలని బహిష్కరించాలని మాటలు కూడా జోరుగా ప్రచారం అవుతున్నాయి.
ఈ టాస్క్ అన్‌ఫెయిర్ అని షాకిబ్ అంది. “ఇద్దరికీ ఒకే రూల్స్ పెట్టాం, ఇది అన్‌ఫెయిర్ అనిపించనా?” అని కంటెస్టెంట్లను అడిగాడు. అప్పుడు శ్రీజ చేతి ఎత్తి హ్యాండ్ రైజ్ చేసింది. దీన్ని చూసి నవదీప్ ఫైర్ అయ్యాడు. “ఎందుకు హ్యాండ్ రైజ్ చేసావ్?!” అని అడిగి షాకిబ్‌కి కూడా టాస్క్ అర్థం కాక, అతను కన్ఫ్యూజ్ అయిపోయాడు. మధ్యలో నేను కూడా చిన్న హింట్ ఇచ్చాను – “మాక్సిమం అమౌంట్ ఉండాలి” అని. “నువ్వు ఎందుకు హ్యాండ్ రైజ్ చేసావ్? ఊరి నుంచి వచ్చి ఇలా చేయడం తప్పు. అన్‌ఫెయిర్ అని చెప్పే హక్కు నీకు లేదు. వెళ్ళి కూర్చో” అని నవదీప్ బాగా ఎడాపెడా పిలిచాడు. శ్రీజ అటు గొణుక్కుంటూ వెళ్లిపోయింది.
ఈ నాలుగో ఎపిసోడ్ ముగిసే వరకు హరీష్, శ్రీజ, పవన్, ప్రియ, కల్కి ఐదుగురు గోల్డెన్ చెయిర్లో కూర్చున్నారు. ఇక నెక్ట్స్ ఎపిసోడ్లో కొత్త టాస్కులు ఏంటి, ఎవరు టాప్ 15లోకి చేరతారో, చివరగా ఎవరు బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లతారో చూడాలి.
ఈ విషయం నవదీప్ చేరాక తను క్షమాపణ అడుగుతూ ఒక వీడియో రిలీజ్ చేసారు,ఆ వీడియో లో కూడా మనస్ఫూర్తిగా మాట్లాడకుండా వెటకారంగా మాట్లాడం ప్రజలని మరింత ఆగ్రహానికి గురి చేస్తుంది,ఇవన్నీ చూసాక బిగ్ బాస్ నుంచి నవదీప్ ని తొలగిస్తారని బిగ్ బాస్ రివ్యూవర్స్ జోరుగా ప్రచారం చేస్తున్నారు,దీన్ని బట్టి చూస్తే నిజంగానే నవదీప్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతారా లేదా అనేది ముందు ఎపిసోడ్ చూడాల్సిందే.
కిందటి సంవత్సరం బిగ్ బాస్ కి అంత ఆదరణ ప్రజల నుండి రాకపోయినా ఈ సారి బారి బడ్జెట్ తో ప్రారంభమయ్యే ఈ షో ఎంత వరకు సక్సెస్ అవుతుందో ఈ ఏడాది చూడాల్సిందే,ఇప్పటికే కొంత మంది ప్రముఖ సెలెబ్రెటీ పేర్లు ఈ షోలోకి వెళ్తున్నట్టు బయటకి తెల్సిన విషయమే,ఈ ఏడాది అయినా కామన్ పీపుల్ ని సెలెబ్రెటీస్,బిగ్ బాస్ ఏ తేడా లేకుండా చూస్తారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
