DNews: Jan 31: ఖమ్మం జిల్లా ఎడులపురం మున్సిపాలిటీ సాయి ప్రభాత్ నగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ గతంలో కేసీఆర్ పాలనలో భారీ అవినీతి జరిగిందని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కాకుండా తమ ఖాతాలను నింపుకోవడానికే పనిచేసిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తమ స్వార్థ ప్రయోజనాల కోసం నిర్మించబడిందని, అది కూలిపోయిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ రెండు సార్లు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని ఆయన మండిపడ్డారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి 11న రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయని, ఈ ఎన్నికల్లో 32 డివిజన్లలో విజయం సాధిస్తామనే నమ్మకం ఉందని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రజల ఆశీర్వాదాలతో ప్రజల ప్రభుత్వం ఏర్పడిందని, అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వివరించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదలకు ఇళ్లు ఇవ్వలేదని, కానీ తమ ప్రభుత్వంలో రూ. 22,500 కోట్ల విలువైన ఇళ్లు రాష్ట్రవ్యాప్తంగా అందించామని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఎడులపురం మున్సిపాలిటీని రాష్ట్రంలో ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. పేదల కష్టాలు తెలిసిన పెద్ద కుమారుడిగా వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. గత రెండు సంవత్సరాల్లో ఎడులపురం 5వ, 6వ డివిజన్లలో రూ. 19 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. మున్నేరు రిటైనింగ్ వాల్ వచ్చే వర్షాకాలానికి పూర్తవుతుందని, ఎఫ్‌సీఐ గోదాం ఇక్కడి నుంచి తరలించబడుతుందని తెలిపారు.

By Mosha

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana