Athlete Jyothi gets Group-1 job, 500-yard house in Visakhapatnam (DTv Telangana)

DNews: Jan29:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అథ్లెట్ జ్యోతి యర్రాజీకి శుభవార్త అందించింది. 2025లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జ్యోతి బంగారు పతకం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆమె ప్రతిభను గుర్తించి గ్రూప్-1 ప్రభుత్వ ఉద్యోగం, విశాఖపట్నంలో 500 గజాల ఇంటిని బహుమతిగా ప్రకటించింది. ప్రభుత్వం ఇచ్చిన బహుమతి పట్ల జ్యోతి ఆనందం వ్యక్తం చేసింది. తనను ఈ స్థాయిలో ప్రోత్సహించినందుకు సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లకు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. “ఇలాంటి గౌరవం లభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ప్రోత్సాహం వల్లే నేను ఈ విజయం సాధించగలిగాను. దేశానికి, రాష్ట్రానికి మరిన్ని పతకాలు తీసుకురావడానికి నేను నిరంతరం కృషి చేస్తాను” అని జ్యోతి యర్రాజీ భావోద్వేగ వీడియోను విడుదల చేశారు.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana