
DET:DEC 02:
యాక్షన్ కింగ్ రణవీర్ సింగ్ నటించిన ‘ధురందర్’ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రిపోర్ట్ ఇదిగో!
అడ్వాన్స్ బుకింగ్‌తోనే రికార్డు: రూ. 2 కోట్లు దాటిన వసూళ్లు:
రణవీర్ సింగ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ధురందర్ సినిమా రిలీజ్ కి ముందే బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తాజాగా ఓపెన్ అయిన అడ్వాన్స్ బుకింగ్స్ అంచనాలకు మించి దూసుకుపోతున్నాయి. మొదటి రోజుకే ఈ చిత్రం ఏకంగా రూ. 2 కోట్ల గ్రాస్ కలెక్షన్ మార్క్‌ను దాటేసింది. బ్లాక్ చేసిన సీట్లతో కలుపుకుంటే ఈ వసూళ్లు ₹1.97 కోట్ల నుంచి ₹1.99 కోట్ల మధ్య ఉన్నాయని రిపోర్టులు చెబుతున్నాయి. సినిమాపై ప్రేక్షకుల్లో ఎంత ఆసక్తి ఉందో ఈ నంబర్లే చూపిస్తున్నాయి.
టికెట్ల అమ్మకాలు షోల సంఖ్య:
తాజా రిపోర్టుల ప్రకారం ధురందర్ సినిమాకు ఇప్పటివరకు 8,600 నుంచి 12,000 వరకు టికెట్లు అమ్ముడయ్యాయి. టికెట్ల అమ్మకం ద్వారా వచ్చిన అసలు వసూలు దాదాపు రూ. 43 లక్షల నుండి రూ. 60 లక్షల వరకు ఉంది. మొదటి రోజు దేశవ్యాప్తంగా దాదాపు 2,240 నుంచి 2,313 షోలను కేటాయించారు. రిలీజ్ అయ్యే లోపు ఈ సంఖ్యలు మరింతగా పెరిగే అవకాశం ఉంది.
రాష్ట్రాల వారీగా స్పందన:
ధురందర్ సినిమాకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్ లాంటి మెట్రో నగరాల్లో బుకింగ్స్ జోరుగా ఉన్నాయి.మహారాష్ట్ర, అడ్వాన్స్ బుకింగ్స్‌లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ దాదాపు ₹48 లక్షల నుంచి ₹53 లక్షల వరకు వసూళ్లు వచ్చాయి.ఢిల్లీ-ఎన్‌సీఆర్ ఆ తర్వాతి స్థానంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్ ఉంది, ఇక్కడ కూడా బుకింగ్స్ చాలా బాగా జరుగుతున్నాయి.గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లు నమోదయ్యాయి.తెలంగాణలో కూడా సినిమాకు మంచి స్పందన కనిపిస్తోంది.
అంచనాలను పెంచుతున్న సినిమా:
ఉరి ది సర్జికల్ స్ట్రైక్ ఫేమ్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణవీర్ సింగ్ తో పాటు సంజయ్ దత్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ వంటి స్టార్ క్యాస్ట్ ఉంది. ఇది ఒక స్పై-యాక్షన్ థ్రిల్లర్ అని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రణవీర్ సింగ్ యాక్షన్ సినిమాతో రెండేళ్ల తర్వాత మళ్లీ పెద్ద తెరపైకి వస్తుండటంతో, సినిమాకు భారీ ఓపెనింగ్స్ ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
