11,403 క్లర్కు ఉద్యోగాలకు ముగుస్తున్న గడువు
న్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2027-28 సంవత్సరానికి సంబంధించిన కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (క్లర్క్) పోస్టుల భర్తీకి (CRP CSA-XVI) విడుదల చేసిన నోటిఫికేషన్ గడువు త్వరలోనే ముగియనుంది

ఈ నెల (ఆగస్టు) 21తో రిజిస్ట్రేషన్‌కు ఆఖరి తేదీ. దీని ద్వారా మొత్తం 11,403 ఖాళీలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 186, తెలంగాణలో 191 పోస్టులున్నాయి. మొత్తం 11 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఎంపిక ప్రక్రియలో ప్రిలిమ్స్, మెయిన్స్ ఆన్లైన్ పరీక్షలు, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (LLPT), డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనంతరం బ్యాంకులకు తాత్కాలిక కేటాయింపు ఉంటుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు చివరి తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
