DET:11 SEP: నటీనటులు : విజయ్ ఆంటోని, అజయ్ ధిషాన్, దీప్షిక, సముధ్రఖని
దర్శకుడు : లియో జాన్ పాల్
నిర్మాత : ఫాతిమా విజయ్ ఆంటోని
సంగీతం : విజయ్ ఆంటోని
సినిమాటోగ్రఫీ : ఎస్. యువ

కథ నగరంలో వరుస హత్యలతో మొదలవుతుంది. ప్రత్యేకంగా మహిళలపై జరుగుతున్న ఈ దారుణ ఘటనలు ప్రజల్లో భయాన్ని, పోలీసుల్లో ఆందోళనను కలిగిస్తాయి. కేసు తీవ్రతను గ్రహించిన అధికారి ధృవ్ (విజయ్ ఆంటోనీ) దర్యాప్తు బాధ్యతలు చేపడతాడు. ఒకటి తర్వాత ఒకటిగా ఆధారాలు వెతుకుతూ ఉండగా, అతని దారిలోకి “తమిళారివు” (అజయ్ ధిషన్) అనే అసాధారణ జ్ఞాపకశక్తి కలిగిన యువకుడు వస్తాడు. అతని ప్రత్యేకమైన మెమరీ, గతంలో చూసిన ప్రతి చిన్న విషయాన్నీ గుర్తుంచుకునే శక్తి ధృవ్ దర్యాప్తుకు కొత్త కోణాన్ని తెస్తుంది.ఈ హత్యల వెనుక ఉన్న అసలు నేరస్థుడు ఎవరు?తమిళారివు యొక్క ప్రత్యేక శక్తి ఈ మిస్టరీని ఛేదించగలదా, లేక అతడే ఈ కేసులో ఒక అనుమానితుడిగా మారతాడా?ధృవ్ తన తెలివితో, తన అనుభవంతో ఈ నేర గుట్టును చేధించగలడా?ఈ ప్రశ్నలకు సమాధానం దొరకే వరకు కథ ఉత్కంఠను కొనసాగిస్తూ ప్రేక్షకులను చూపు తిప్పకుండా చేసారు.

నటన
విజయ్ ఆంటోనీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో బలంగా నిలబడ్డారు. ఆయన శాంతమైన కానీ గట్టిగా ఆలోచించే స్వభావాన్ని బాగా చూపించారు.
అజయ్ ధిషన్ కి వచ్చిన పాత్ర కొత్తగా అనిపించింది. ఆయన ప్రదర్శనకు కొన్ని సన్నివేశాలు బలాన్నిచ్చాయి.
సహాయ పాత్రల్లో సముద్రకని, బ్రిగిడా, దీప్షికా వంటి వారు ఉన్నా, వారికి పెద్ద స్కోప్ రాలేదు.
దర్శకుడు లియో జాన్ పాల్ మొదటిసారి దర్శకత్వం వహించారు. కథలో కొత్త కాన్సెప్ట్ ఉన్నప్పటికీ, కొన్ని చోట్ల నెమ్మదిగా నడుస్తూ ఉత్కంఠ తగ్గినట్లు అనిపిస్తుంది.
సంగీతం దర్శకుడు విజయ్ ఆంటోనీ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్లర్ మూడ్‌ను బలపరిచింది. పాటలు మాత్రం పెద్దగా గుర్తుండిపోయేలా లేవు.
కెమరా వర్క్ చీకటి వాతావరణం, క్రైమ్ సెటప్‌లను సరిగ్గా చూపించడంలో కెమరామెన్ విజయం సాధించారు.

మార్గన్ సినిమా కలక్షన్స్
మార్గన్ విడుదలైన మొదటి రోజు నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అయితే ఓపెనింగ్ కలక్షన్స్ మాత్రం పెద్దగా ఆశించిన స్థాయిలో రాలేదు. ప్రారంభ రోజున సాధారణ స్థాయి వసూళ్లు వచ్చాయి. రెండో రోజు నుంచి మాత్రం పాజిటివ్ మౌత్ టాక్ వల్ల కొంత పెరుగుదల కనిపించింది.మొదటి వారాంతానికి సినిమా సుమారు ఏడు కోట్లకు పైగా వసూలు చేసి సరాసరి రేంజ్‌లో నిలిచింది. తరువాతి రోజుల్లో కూడా స్థిరమైన కలక్షన్స్ కొనసాగాయి. పదో, పదకొండో రోజులకు కలిపి దాదాపు పది కోట్లకు సమీపంగా చేరుకోవడం గమనార్హం. సినిమా బడ్జెట్ దాదాపు పది కోట్ల పరిధిలో ఉండటంతో, ఖర్చు తిరిగి రాబట్టే దిశగా వసూళ్లు క్రమంగా సహకరించాయి.


మొత్తం మీద చూసుకుంటే మార్గన్ ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కథలో కొత్తదనం ఉన్నా, దాన్ని సరైన రీతిలో వినియోగించలేకపోవడంతో ఫలితం ఆశించిన స్థాయికి చేరలేదు. మొదటి భాగం నెమ్మదిగా, కొంత విసుగుగా సాగుతుండగా, రెండో భాగంలో కొంత బాగుందనిపించినా, మొత్తం కథనం ఒక రొటీన్ పద్ధతిలోనే ముగిసిపోయింది. క్రైమ్ థ్రిల్లర్ అభిమానులు కూడా దీనికి బలమైన కనెక్ట్ కావడం కష్టమే.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana
పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana