DNews:09 Dec: ఎఎమ్మెల్యే కవిత బీఆర్ఎస్ పట్ల తీవ్రమైన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కారు పార్టీ, ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలపై ఆమె తీవ్రంగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తోంది. ఇటీవల మేడ్చల్ జిల్లాలో పర్యటించిన కవిత, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, మాజీ మంత్రి మల్లారెడ్డి మీద అటాక్ చేశారు.మల్లారెడ్డి పై భూకబ్జా, అవినీతి సంబంధి నిందలు ఎక్కు పెట్టి పాలమ్మ, పూలమ్మల పేర్లతో తన విమర్శలను ఘాటు చేశారు. కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందను కూడా అవినీతి, కబ్జాల బాగోతంలో దుయ్యంగా చిత్రించారు. “కుత్బుల్లాపూర్ కాదు కబ్జాలాపూర్” అంటూ సెటైర్ కూడా చేశారు.

హరీశ్ రావుపై కూడా విమర్శలు చేస్తున్న కవిత, మేడ్చల్ జిల్లాలో కనీసం ఒక హాస్పిటల్ కూడా నిర్మించలేదని ఫైర్ అయ్యారు. ఇక సత్తి విషయం కేటీఆర్ పైనే విమర్శలు కురిపించడంతో ‘డిప్యాక్టో సీఎం’ అనే ట్యాగ్ కూడా పెట్టారు.డిసెంబర్ 9వ తేదీ “విజయ్ దివస్” సందర్భంగా కూడా కవిత తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో ఉంచింది. “అధికారం కోల్పోయాక దీక్షా దివస్‌లు, విజయ్ దివస్‌లు.. ఇది ఉద్యమాల గడ్డ.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు” అంటూ ట్వీట్ వైరల్ అయింది.ఈ నేపథ్యంలో, కవిత సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా “డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదని” తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కీలక ట్వీట్ చేశాడు.డిసెంబర్ 9ని విజయ్ దివస్ గా పేర్కొన్నారు. నవంబర్ 29ని దీక్షా దివస్ గా బీఆర్ఎస్ ఉత్సవాలు నిర్వహించింది. ఈ రెండు పరిణామాలపై కవిత చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. ఇవాళ విజయ్ దివస్ గా పేర్కొంటూ ట్వీట్ చేసిన కేటీఆర్ దుబాయ్ వెళ్లడం గమనార్హం. దీనిపై కారు పార్టీ ఎక్కడా కార్యక్రమాలు నిర్వహించలేదు.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana