సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం **‘వారణాసి’**పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ పాన్ వరల్డ్ మూవీ విడుదలకు ముందే బిజినెస్ పరంగా సంచలనాలు సృష్టించబోతుందనే చర్చ టాలీవుడ్‌లో మొదలైంది.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ హక్కుల విషయంలో రూ.320 కోట్లకు పైగా బిజినెస్ జరుగుతున్నట్లు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వార్త నిజమైతే తెలుగు రాష్ట్రాల సినిమా మార్కెట్‌లో ‘వారణాసి’ సరికొత్త రికార్డును నెలకొల్పే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటివరకు రాజమౌళి సినిమాలకు ఉన్న థియేట్రికల్ మార్కెట్‌ను పరిశీలిస్తే.. ‘బాహుబలి 2’ రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.122 కోట్ల బిజినెస్ చేయగా, ‘ఆర్ఆర్ఆర్’ దాదాపు రూ.230 కోట్ల స్థాయిలో బిజినెస్ చేసినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. ఇప్పుడు మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ ఏకంగా రూ.320 కోట్ల మార్క్‌ను దాటబోతుందనే టాక్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అదే జరిగితే ‘బాహుబలి 2’, ‘ఆర్ఆర్ఆర్’ రికార్డులను అధిగమించి.. ఏపీ, తెలంగాణలో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన చిత్రంగా ‘వారణాసి’ నిలిచే అవకాశం ఉంది. మహేష్ బాబుకు ఉన్న భారీ స్టార్ ఇమేజ్‌కు రాజమౌళి బ్రాండ్ కలవడంతో సినిమాపై ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ఈ బిజినెస్ టాక్ తెలియజేస్తోందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇప్పటికే ‘వారణాసి’ కథ, భారీ స్కేల్, విజువల్స్, అంతర్జాతీయ స్థాయి లొకేషన్లపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో థియేట్రికల్ రైట్స్‌పై కూడా భారీ డిమాండ్ ఏర్పడినట్లు తెలుస్తోంది.

అయితే రూ.320 కోట్లకు పైగా బిజినెస్ అనే ప్రచారంపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ అంచనాలు నిజమైతే మాత్రం.. విడుదలకు ముందే ‘వారణాసి’ టాలీవుడ్ బాక్సాఫీస్ మార్కెట్‌లో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసినట్లే అవుతుంది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana