నేచురల్ స్టార్ నాని, ‘దసరా’ ఫేమ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ **‘ది ప్యారడైజ్’**పై భారీ అంచనాలు ఉన్నాయి. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా విడుదల విషయంలో కొంతకాలంగా సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అయ్యాయి. షూటింగ్ ఆలస్యం కావడంతో రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందంటూ ప్రచారం జరిగింది.

అయితే ఈ ఊహాగానాలకు చిత్రబృందం వరుస పోస్టర్లతో చెక్ పెట్టింది. ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారమే 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి సినిమా రాబోతుందని స్పష్టం చేసింది. దీంతో రిలీజ్‌పై వస్తున్న రూమర్లకు తెరపడినట్లైంది. ప్రస్తుతం కొత్త పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.

పోస్టర్లలో కనిపిస్తున్న నాని లుక్ సినిమాకు మరో స్థాయి హైప్ తీసుకొచ్చింది. ‘జడల్ జమానా షురూ’ అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన పోస్టర్లలో నాని గతంలో ఎన్నడూ కనిపించని రా అండ్ రస్టిక్ అవతార్‌లో దర్శనమిచ్చాడు. రెండు జడలతో గ్యాంగ్‌స్టర్ తరహా లుక్‌లో కనిపిస్తూ పవర్‌ఫుల్‌గా కూర్చున్న నాని లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

మరో పోస్టర్‌లో రక్తంతో తడిసిన దేహంతో ఆకాశం వైపు చూస్తూ నాని కనిపించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. వర్షంలో భుజంపై ఆయుధంతో ఇచ్చిన బ్యాక్ పోజ్ కూడా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. అదే సమయంలో హీరోయిన్‌ను ఎత్తుకుని డ్యాన్స్ చేస్తున్న నాని లుక్.. సినిమాలో యాక్షన్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్‌కు కూడా ప్రాధాన్యం ఉంటుందని సూచిస్తోంది.

‘దసరా’తో నాని మాస్ యాక్షన్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన శ్రీకాంత్ ఓదెల.. ఈసారి అంతకుమించిన రా, రస్టిక్ ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లబోతున్నట్లు ఈ పోస్టర్లతో స్పష్టమవుతోంది. దీనికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అదనపు బలంగా మారనుంది.

ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇషాన్ సక్సేనా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో భారీ ఆసక్తి రేపుతున్న ‘ది ప్యారడైజ్’.. సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana