
Dnews 28: నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన ఆకస్మిక వరద వల్ల కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లిన ఈశా ఫౌండేషన్ బృందంలోని 80 మంది ఆచూకీ గల్లంతైందని ఆ సంస్థ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ ప్రకటించారు.
నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన ఆకస్మిక వరద వల్ల కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లిన ఈశా ఫౌండేషన్ బృందంలోని 80 మంది ఆచూకీ గల్లంతైందని ఆ సంస్థ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ ప్రకటించారు. ఆ యాత్రికుల ఆచూకీని కనుగొనేందుకు, టిబెట్‌లోని గైరోంగ్‌లో జరుగుతున్న సహాయక చర్యల్లో పాల్గొనేందుకు తనతోపాటు తన బృందానికి అనుమతినివ్వాలని భారత్, చైనా ఎంబసీలకు వినతి చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ వీడియో పోస్టు చేసిన జగ్గీ వాసుదేవ్.. వరద ప్రభావంతో ఎదురైన పరిస్థితిని వివరిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఓ దశలో కంటతడి పెట్టుకున్నారు. టిబెట్‌లోని ఈశా ఫౌండేషన్ శిబిరంలో జగ్గీ వాసుదేవ్ ప్రస్తుత పరిస్థితిని వివరిస్తుండగా.. శిబిరంలో ఉన్న వారు కూడా రోదించారు. అయితే, తనతోపాటు కొంతమంది వలంటీర్లతో కూడిన చిన్నబృందానికి ప్రభుత్వాలు అనుమతినిస్తే గైరోంగ్ చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొంటామని పేర్కొన్నారు.
